పారిశ్రామిక వేత్తగా, రాజకీయ వేత్తగా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణమరాజు గుర్తింపు తెచ్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవాళ(గురువారం) ఆయన బాధ్యతలు స్వీకరించారు. సభలో డిప్యూటీ సీఎం ప్రకటన సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రఘురామపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘విశాఖపట్నంలో గల ఆంధ్రాయూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చేశారని.. డిస్టెన్షన్‌లో రఘురామ పాస్ అయ్యారు. ఎడిబుల్ ఆయిల్‌లో కూడా ఆయన వ్యాపారం చేశారు. అప్పట్లో సిరీస్ ఫార్మాను ఆయన స్ధాపించారు. డిప్యూటీ స్పీకర్ 2019లో నరసాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఏదైనా ఫ్రాంక్‌గా రఘురామ మాట్లాడుతారు. కల్మషం ఉండదు ముందు, వెనుక చూడకుండా మాట్లాడుతారు. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. అదే రఘరామకు ఇబ్బందులు తెచ్చింది. జగన్ ప్రభుత్వం ఏపీలో టెర్రరిజన్ని స్పాన్సర్ చేసింది. అధినేత నిర్ణయాలతో విభేదించినప్పుడు కావాలంటే పార్టీకి దూరంగా ఉంటారు. అయితే రఘురామపై జగన్ ఏవిధంగా కుట్రపన్నారో చూశాం.ముందు బెదిరించారు తర్వాత బయపెట్టారు. ఏకపక్షంగా తన సొంత ఎంపీపై లేని రాజద్రోహం కేసును నమోదు చేసి 2021మే 14న ఆయన పుట్టిన రోజున అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందాలని అరెస్టు చేశారు. ఒక ఎంపీని పోలీసు కస్టడీలో టార్చర్ చేయడం సీఐలు, ఐపీఎస్ అధికారులు దీనిలో పాల్గొనడం ఇదే దేశంలో మొదటిది, ఆఖరు సంఘటన కావాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.