ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే కె. రఘురామకృష్ణరాజు బాధ్యతలు చేపట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తాను జైల్లో ఉన్న సమయంలో.. తన రూంలో సీసీ టీవీలు పెట్టి రిమోట్ ద్వారా చూడాలనుకున్నారన్నారు. అయితే గతంలో రఘురామరాజు విషయంలో ఆయన్ను కొడుతూ వీడియో కాల్లో చూసారన్నప్పుడు అలా జరగుతుందా? అని అనుకున్నానని చెప్పారు. కానీ తనకు అదే జరిగే సరికి నమ్మాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు ఎక్కడైనా చోటు చేసుకున్నాయా? అని పరిశీలిస్తే.. ఇటువంటి వ్యక్తి కొలంబియాలో ఉన్నాడని తెలిసిందని.. అతడి పేరు ప్యాబ్లో ఎస్కోబార్ అని చెప్పారు. ఆ దేశంలోనే అత్యంత ధనికుడిగా, దుర్మార్గుడిగా ఖ్యాతి గాంచాడన్నారు. ప్రపంచంలో 80 శాతం కోకైన్ ఆయనే తయారు చేసి.. సరఫరా చేసే వాడని తెలిపారు. ఇక్కడ ఈయన్ని చూస్తే.. డ్రగ్స్, గంజాయి వచ్చిందని వివరించారు.