ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2024, 09:14 PM

ప్రయాణికుల రద్దీ నియంత్రణకు శబరిమలకు గుంతకల్లు డివిజన్‌ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ (వయా గుత్తి) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ-కొట్టాయం (నం. 07133) రైలు ఈ నెల 14, 21, 28 తేదీల్లో కాచిగూడలో మధ్యాహ్నం 3-40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6-50 గంటలకు కొట్టాయం చేరుతుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07134) ఈ నెల 15, 22, 29 తేదీల్లో కొట్టాయంలో రాత్రి ఎనిమిదిన్నరకు బయలుదేరి, మరుసటిరోజు రాత్రి 11-40 గంటలకు కాచిగూడకు చేరుతుందన్నారు. అలాగే హైదరాబాదు-కొట్టాయం (నం. 07135) రైలు (వయా గుంతకల్లు) ఈ నెల 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాదులో బయలుదేరి, మరుటిరోజు మధ్యాహ్నం 4-10 గంటలకు కొట్టాయం చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07136) ఈ నెల 20, 27 తేదీల్లో కొట్టాయంలో సాయంత్రం 6-10 గంటలకు బయలుదేరి మరుటిరోజు రాత్రి 11-45 గంటలకు హైదరాబాదుకు చేరుతుందన్నారు. నాందేడ్‌-కొల్లాం (నం 07139) ప్రత్యేక రైలు (వయా గుంతకల్లు) ఈ నెల 16న నాందేడ్‌లో ఉదయం 8-20 గంటలకు బయుదేరి మరుసటి రోజు రాత్రి పదిన్నరకు కొల్లాం చేరుతుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07140) ఈనెల 18న కొల్లాంలో తెల్లవారుజాము రెండున్నరకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు నాందేడ్‌కు చేరుతుందన్నారు. మౌలాలి-కొల్లాం ప్రత్యేక రైలు (నం. 07141) (వయా గుంతకల్లు) ఈనెల 23, 30 తేదీల్లో మౌలాలిలో మధ్యాహ్నం 2-45 గంటలకు బయలుదేరి, మరుసటిరోజు రాత్రి పదిన్నరకు కొల్లాం చేరుతుందన్నారు. దీని తిరుగుప్రయాణపు రైలు (నం. 07142) ఈ నెల 25, డిసెంబరు 2న కొల్లాంలో తెల్లవారుజాము రెండున్నరకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1 గంటకు మౌలాలికి చేరుతుందని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com