ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బు వసూలు చేసిన మోర్ల మహిధర్ అనే వ్యక్తిపై రేపల్లె పట్టణ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రేపల్లె పట్టణ మూడో వార్డుకు చెందిన దేవగిరి రవిశంకర్ కు ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం నిడమానూరు గ్రామానికి చెందిన మోర్ల మహిధర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పట్టణ సిఐ మల్లికార్జునరావు తెలిపారు.