పొందూరు మండలంలోని కనిమెట్ట గ్రామంలో శనివారం విషాద ఘటన జరిగింది. మధుసూదనరావు తన ఇంటి బావిలో పాము చనిపోయి ఉండటంతో, బావిని శుభ్రపరిచేందుకు మోటార్ పెట్టాడు. కానీ తాడు తెగిపోతే, మోటార్‌ను తీసేందుకు బావిలో దిగాడు.
అప్పుడు ఊపిరి ఆడక అక్కడే కుప్పకూలాడు. అతని మేనల్లుడు కింతలి వినోద్ కూడా బావిలోకి దిగగా, అతనూ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా వారు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.