రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ వాతావరణం తగ్గడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్‌పై లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై ఇప్పటి వరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్దదిగా చెబుతున్నారు. అయితే, ఈ దాడుల సమయంలో కీవ్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలోకి వెళ్లిపోయారు. కీవ్‌లోని ప్రజలు ఇంకా బంకర్లలోనే ఉన్నట్లు సమాచారం.