ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఓ రైలుమార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దువ్వాడ-తుని రైలు మార్గంలో ప్రతి మూడు రోజులకు ఒక మరణం సంభవిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దువ్వాడ-తుని రైలు మార్గం 80 కిలోమీటర్ల మేరకు ఉంటుంది. ఈ రూట్లో నిత్యం 140 నుంచి 150 వరకూ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే గత పది నెలల లెక్కలు చూస్తే ఈ రూట్లో 104 మంది వివిధ కారణాలతో చనిపోయారు. ప్రతి మూడు రోజులకు ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.