గుంటూరు నగరపాలక సంస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విభాగంలో ఆప్కోస్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు నెలకు రూ. 15 వేతనం రావలసి ఉండగా రూ. 12 వేలు వేతనం ఆప్కోస్ నందు తప్పుగా నమోదయిందని కార్మికులు తెలిపారు. కార్మికులు మంగళవారం గుంటూరులో మేయర్ మనోహర్ నాయుడును కలసి 2020 ఆగస్టు నుంచి 2021 ఏప్రిల్ వరకు తమకు తగ్గిన వేతనాన్ని అందించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. మేయర్ సానుకూలంగా స్పందించారు.