రైల్వే ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు ఇండియన్ రైల్వే ముఖ్య ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలోని జోన్లలో వివిధ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించి నవంబర్ 1వ తేదీన నిర్వహణ తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆ షెడ్యూల్లో మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలన్నీ నవంబర్, డిసెంబర్ నెలల్లోనే జరుగనున్నాయి. పరీక్షకు పది రోజుల ముందు ఎగ్జామ్ సిటీ, తేదీ వివరాలు, నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రైల్వే శాఖ పేర్కొంది.
అయితే.. ఈ పరీక్షకు ఆధార్ లింక్‌డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి కాబట్టి అభ్యర్థులు ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
సవరించిన పరీక్ష షెడ్యూల్ ప్రకారం.. సీఈఎన్ ఆర్పీఎఫ్ 01/2024 ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష 2024 డిసెంబర్ 2, 3, 9, 12, 13, 2024 తేదీల్లో జరుగుతుంది. అలాగే.. సీఈఎన్ 03/2024 జేఈ అండ్ అదర్స్ పరీక్షను 2024 డిసెంబర్ 16, 17, 18 తేదీల్లో, సీఈఎన్ 02/2024 టెక్నీషియన్ (గ్రేడ్ 1) (గ్రేడ్ 3) పరీక్షను డిసెంబర్ 19, 20, 23, 24, 26, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.