కొమురవెళ్లి మండలంలోని తెలంగాణ ప్రభుత్వ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంను బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు సందర్శించి అక్కడి సమస్యలను మరియు పరిస్థితులను విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇక్కడ కొంత మంది విద్యార్థినిలతో మాట్లాడితే ఇప్పటి వరకు దుప్పట్లు,దుస్తులు, ఫుడ్ సమస్య, వాటర్ సమస్య, మెడికల్ సమస్య మరియు వారికి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థుల సమస్యలు తెలియజేశారని అన్నారు.సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని,విద్య వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని,కస్తూర్భా గాంధీ పాఠశాలు పూర్తి అధ్వానంగా మారుతున్నాయి అని తెలిపారు.
ఇప్పటి వరకు విద్య శాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకునే నాధుడే లేడని దీనికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు ఏర్పుల మహేష్,కొమురవెళ్లి మాజీ జడ్పీటీసీ సిలివేరు సిద్ధప్ప,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తలారి కిషన్,తాండ్ర సాగర్, విరాట్ బాబు తదితరులు పాల్గొన్నారు.