విద్యార్థుల బోధనభ్యసనకు బోధనోపకరణాలు ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు వాటి ద్వారా విద్యాబోధన చేస్తే విద్యార్థులకు సులభంగా నేర్చుకుంటారని ప్రధానోపాధ్యాయులు నాగరాజు అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలకు శ్రీ వివేకానంద సొసైటీ సహకారంతో గణిత బోధనోపకరణాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి బోధనోపకరణాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధన చేయడమే కాకుండా ఇలాంటి బోధనోపకరణాల ద్వారా విద్యను బోధిస్తే విద్యార్థులకు ఎల్లప్పుడూ గుర్తుకు ఉంటాయని వారికి తొందరగా అర్థం అవుతాయన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పాఠశాల ఉపాధ్యాయులు వంశీ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.