2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువు జులై 1తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 (4) కింద.. జులై 1 లోగా ఐటీఆర్ ఫైలింగ్ చేయని వారికి.. జరిమానా చెల్లించి టాక్స్ రిటర్న్స్ చేసే అవకాశం ఉంటుంది. దీనినే బిలేటెడ్ ఐటీఆర్ అని పేర్కొంటారు. ఇంకా దీంట్లో భాగంగా కొన్ని షరతులు కూడా వర్తిస్తాయని చెప్పొచ్చు. బిలేటెడ్ ఐటీఆర్ అంటే ఆలస్యంగా దాఖలు చేసే రిటర్న్స్ అన్నమాట. దీని కోసం ఆఖరి తేదీ డిసెంబర్ 31 వరకు ఉంటుంది. అంటే ఇంకా కొన్ని రోజులే అవకాశం ఉంది. జులై 31లోగా ఐటీఆర్ దాఖలు చేయని వారు.. ఈలోగా చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే.. జులై 31 తేదీ దాటితే బిలేటెడ్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలంటే రూ. 5000 ఫైన్ చెల్లించాల్సిందే. రూ. 5 లక్షలపైన వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ ఫైన్ వర్తిస్తుంది. అదే రూ. 5 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారు.. చిన్న చిన్న టాక్స్ పేయర్లకు ఆలస్యపు ఐటీఆర్ దాఖలుపై రూ. 1000 జరిమానా పడుతుంది.
ఇంకా.. జులై 31 తర్వాత.. పాత పన్ను విధానంలో పన్ను రిటర్న్స్ దాఖలు చేసే అవకాశం ఉండదు. అప్పుడు.. పాత పన్ను విధానంలోని టాక్స్ బెనిఫిట్స్ పొందలేరు. వీరు కొత్త పన్ను విధానంలోనే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెక్షన్ 80c, 80d వంటి వాటి కింద పన్ను తగ్గించుకునే అవకాశం కోల్పోతారు. వీరికి డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానం వర్తిస్తుంది గుర్తుంచుకోవాలి. అప్పుడు అధిక పన్ను కట్టాల్సి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు టాక్స్ రిటర్న్స్ చేసినా తర్వాత.. ఇ- వెరిఫై చేసుకోవాలి.
ఒకవేళ డిసెంబర్ 31 డెడ్‌లైన్ దాటితే అప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఈ జరిమానా రూ. 5 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి రూ. 10 వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది. బిలేటెడ్ ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీని కోసం ఇన్‌కంటాక్స్ ఇ- ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి.. పాన్ నంబర్ యూజర్ ఐడీగా చేసుకొని లాగిన్ లేదా రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఆదాయాన్ని బట్టి సరైన ఫారం ఎంచుకోవాలి. అసెస్‌మెంట్ ఇయర్ (మదింపు సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి అయితే 2024-25 అవుతుంది). తర్వాత.. అడిగిన వివరాల్ని నింపి టాక్స్ పే చేయాలి. తర్వాత ఆధార్ ఓటీపీ నెట్ బ్యాంకింగ్ లేదా ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.