అమెరికాలోని ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువులు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూజెర్సీలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళ ఆకాశంలో ఈ వస్తువులు కనిపించాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అవి యూఎఫ్‌వో తరహా డ్రోన్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల న్యూజెర్సీలో ప్రకాశవంతమైన డ్రోన్లు ఎగిరాయి. తమ భవనాల మీదుగా ఇవి ఎగరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.