గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధనేరాల అభియోగాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఇజ్రాయెల్‌లో అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో ఆయన తొలిసారి కోర్టు మెట్లు ఎక్కనున్నారు. మంగళవారం నుంచి విచారణ జరగనుండగా.. నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి ప్రధానిగా నిలిచారు. నమ్మకద్రోహం, మోసం, అవినీతి ఆరోపణలకు సంబంధించి కోర్టులో విచారణ మొదలుకానుంది. అయితే ఈ ఆరోపణలను గతంలోనే నెతన్యాహు ఖండించారు. ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న నెతన్యాహు.. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు కలిగిన నేతగా పేరుగాంచి.. కోర్టు మెట్లు ఎక్కనుండటం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.