ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేవ్బారికి గుడ్ న్యూస్ , ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రత్యేకమైన టాలెంట్లను బయటపెట్టి వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది వర్చ్యువల్ ప్రపంచంలో ఎంతో ప్రముఖమైన ఒక ఫీచర్. ఇది 15 నుంచి 90 సెకన్ల వీడియోలను క్రియేట్ చేసి షేర్ చేసే పద్ధతిగా పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్ యూజర్లకు చిన్న, క్రియేటివ్ వీడియోలు రూపొందించి, తనిఖీ చేయగలిగే ఓ కొత్త విధానంగా రీల్స్ రూపొందించబడింది. ఈ ఫీచర్లో వీడియోలను ఎడిట్ చేయడం, మ్యూజిక్ యాడ్ చేయడం, ఫిల్టర్లను ఉపయోగించడం, ట్రెండింగ్ సాంగ్స్‌ను ఎంపిక చేసుకోవడం వంటి అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. రీల్స్ ద్వారా యూజర్లు తమ టాలెంట్స్‌ను ప్రపంచానికి చూపించవచ్చు, మరింత మంది ఫాలోవర్లను సంపాదించవచ్చు, మరియు బ్రాండ్ ప్రొమోషన్లలో భాగంగా ఉత్పత్తులు మరియు సేవలను ప్రచారం చేయవచ్చు. వాణిజ్య రంగంలో కూడా ఈ ఫీచర్ ఎంతో ప్రభావం చూపిస్తోంది, ఎందుకంటే ఇది మార్కెటింగ్, ఎడ్యుకేషన్, మరియు ఎంటర్టైన్మెంట్ రంగాలలో వినియోగదారులతో కుడిది, విస్తృతమైన ఆడీయన్స్ను చేరుకోవడానికి సహాయపడుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ యొక్క విజయం, దీని వినియోగదారుల క్రియేటివిటీ, అనువైన విధానం మరియు ట్రెండింగ్ కంటెంట్‌ను పంచుకునే సామర్థ్యంతో ముద్ర వేసింది.
సోషల్ మీడియాలో అందరూ ఎక్కువ ఉపయోగించే ఇన్స్టాగ్రామ్ తాజాగా తన యూజర్స్ కోసం కొత్త ఫీచర్‌ను అప్డేట్ చేసింది, అదే ట్రయల్ రీల్స్. ఇక నుంచి వీడియో క్రియేటర్లు తమ వీడియోలను ఇదివరకంటే ఈజీగా, క్రియేటివిటీగా చేసుకోవచ్చు. కొత్ కొత్త వీడియోలను చేయడానికి ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. రీల్స్ చేసే చాలామంది కొన్ని ఇబ్బందులు పడుతారు. చేసిన రీల్ సరిగ్గా వచ్చిందా లేదా అనే టెన్షన్ కానీ ఇప్పటి నుంచి ఈ ట్రయల్ రీల్స్ ఫీచర్‌తో మీకు రీల్స్ చేయడానికి మీకు ప్రైవేట్ స్పేస్ ఇస్తుంది. ఇక్కడ మీరు కొత్త ఫిల్టర్లు, ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఉపయోగించి వివిధ రకాల వీడియోలను క్రియోట్ చేయవచ్చు. కానీ ఈ వీడియోలను మీరు మాత్రమే చూడగలరు. కావాలంటే వాటిని మీ స్నేహితులతో, తెలిసినవాళ్లతో పంచుకోవచ్చు. మీలో ఉన్న క్రియేటివిటీని బయటపెట్టే అవకాశం ట్రయల్ రీల్స్ కల్పిస్తుంది. ఇంకా వీడియో ఎడిటింగ్‌కు ట్రయల్ రీల్స్ హెల్ప్ చేస్తుంది. ఈ ట్రయల్ రీల్స్ ఫీచర్‌ని వాడటం చాలా సులభం. దీనికోసం జస్ట్ ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి రీల్స్ క్రియేట్ చేసే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, ట్రయల్ రీల్స్ చేసే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న కొత్త ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ ఇక్కడ వాడుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్లో ఈ ఫీచర్ రాకపోతే యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ చేయాలి. అయినా రాకపోతే మరికొంత కాలం వెయిట్ చేయాలి.