ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ యువతితో కలిసి ఫ్లాట్‌లో ఉంటారా.. ఎలా చూసుకుంటుందో తెలుసా, పోస్ట్ వైరల్

national |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 09:19 PM

ఉద్యోగం, చదువు, కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేందుకు చాలా మంది యువతీయువకులు.. గ్రామాలు, పట్టణాలు వదిలి ఇతర పట్టణాలు, నగరాలకు వెళ్తూ ఉంటారు. కుటుంబ సభ్యులను అందర్నీ విడిచి.. ఆ సిటీలో ఎక్కడో హాస్టల్, రూమ్, పీజీలు తీసుకుని నివసిస్తూ ఉంటారు. ఇక చాలా మందికి సిటీల్లో ఉండే హాస్టల్స్ నచ్చవు. అలా అని ఒక్కరే రూమ్ తీసుకుని ఉండేంత డబ్బులు కూడా ఉండవు. అలాంటప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ కలిసి ఒక రూమ్ తీసుకుని ఖర్చులను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక కొందరు మాత్రం తెలియని వ్యక్తులతో కలిసి రూమ్ తీసుకుని.. ఆ తర్వాత వారితో సరిగా కలిసి ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ యువతి తన ఫ్లాట్‌లో ఉండేవారి కోసం వేచిచూస్తున్నామని.. అయితే వాళ్లు వచ్చిన తర్వాత తాము ఎలా ఉంటామో చెబుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


నిమిషా చందా అనే యువతి.. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటోంది. ఆ 3 బీహెచ్‌కేలో నిమిషా చందాతోపాటు ఆమె ఫ్రెండ్ అగ్రిమా ద్వివేది కూడా ఉంటోంది. అయితే మరో తమ ఫ్లాట్‌లో ఇంకొకకరు ఉండేందుకు చోటు ఉందని.. తన కొత్త ఫ్లాట్‌మేట్ కోసం ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో తన కొత్త ఫ్లాట్‌మేట్ వస్తే తామిద్దరం ఎలా ఉంటాం అనేది వెల్లడించింది. ఇది కాస్తా నెటిజన్లకు ఆసక్తిగా అనిపించడంతో నిమిషా చందా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఆ పోస్ట్‌లో 15 పాయింట్లను నిమిషా చందా వెల్లడించింది.


నేను, అగ్రమా ద్వివేది ఇద్దరం మార్కెటింగ్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నాం. మా వద్ద స్టార్టప్ కంపెనీ ప్రారంభించే ఆలోచనలు, క్రియేటివ్ ఐడియాలు ఉన్నాయి.


మా పనులు చేసుకునేందుకు లాండ్రీ డే అని వారానికి ఒక రోజు కేటాయిస్తాం.


ఎప్పుడూ ఒకటే రకమైన మ్యూజిక్ కాకుండా.. అప్పుడప్పుడు హిప్‌హాప్‌ ప్లే లిస్ట్‌తో ఎంజాయ్‌ చేస్తాం.


మా దగ్గర చాలా పుస్తకాలున్నాయి. రూంలోకి వచ్చిన వారికి పుస్తకాలు చదివే ఇష్టం ఉంటే చదువుకోవచ్చు.


మేం ఇద్దరం కలిసి వంట చేసుకుంటాం. మీకు అర్ధరాత్రి ఆకలేసినా వంట చేసి పెడతాం. సరదాగా అలా బయట కూడా తిరిగి వస్తాం. మీకు ఇష్టమైతే మాతో రావచ్చు.


నా విషయాలు నా ఫ్రెండ్‌కు అన్నీ తెలుసు. కాఫీ తాగి సమస్యలు మర్చిపోతాం. వాటిని ఎలా పరిష్కరించుకోవాలా అని ఆలోచిస్తాం.


మా ఇంటికి ఎవరైనా వస్తే వారితో మాట్లాడడం అంటే ఇష్టం. కిచెన్‌లో వర్క్‌ చేస్తూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం.


కొత్తగా వచ్చే వారి పర్సనల్‌ లైఫ్‌కు ఎలాంటి ఇబ్బంది కలిగించం.


ఒకవేళ వచ్చే వారికి నా బట్టలు, చెవి కమ్మలు కావాలంటే ఇస్తా. మేం మేకప్‌ వేసుకోం. కానీ ఐలైనర్‌ వేసుకుంటే మీరు సహాయం చేయాలి. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాం. నిమిషా చందా చేసిన ఈ పాయింట్లకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com