రాయచోటి పట్టణంలోని శివాలయం సర్కిల్ నందు 5 నూతన ఆర్టిసి బస్సులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశమని రాబోయే రోజులలో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని నూతన బస్సులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామన్నారు.