న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు నిర్వహించే వారికి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పలు సూచనలు చేశారు. మంగళవారం గుంటూరులో ఎస్పీ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయొద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా బాణాసంచా, కాల్చవద్దని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. డిజె సౌండ్లతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. అనంతరం గుంటూరు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.