ఉచిత బస్సు పథకం అమలు చేయాలనే లక్ష్యంతో.. కర్ణాటకలో AP మంత్రులు పర్యటించారు. మంత్రులు అనిత, రాంప్రసాద్, సంధ్యారాణి బెంగళూరుని సందర్శించారు. కర్ణాటకలో మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం.
లబ్ధి గురించి బస్సుల్లో ప్రయాణం చేస్తూ.. వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని మంత్రి అనిత వివరించారు. కర్ణాటక రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితో సహా RTC అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు.