ప్రేమకు ప్రాంతాలు, కులాలు, మతాలతో సంబంధం ఉండదు. ప్రేమకు ఎల్లలు లేవని అంటారు. ఇది అక్షరాలా నిజమే.. రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు వేరైనా ప్రేమలో పడితే వివాహ బంధంతో ఒక్కటవుతారు. తాజాగా ఏపీ చెందిన యువకుడు, జపాన్ యువతి మధ్య మొదలైన పరిచయం.. స్నేహంగా.. తర్వాత ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కింది. దేశాలు వేరైనా తమ కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కర్నూలుకు చెందిన యువకుడు, జపాన్‌కు చెందిన యువతి ఉన్నారు. కర్నూలుకు చెందిన కీర్తి కుమార్ జపాన్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. తాను పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేసే జపాన్ యువతి రింకాతో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలందరినీ ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నట్లు వరడు కీర్తి కుమార్ తెలిపారు.