కోరి కొల్చినవారికి కొంగు బంగారమై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తిరుపతిలో జరిగిన తొక్కిసలాట పాలకుల చేతగానితనమే కారణమని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. పాలనా వైఫల్యం వల్ల ఆరు నిండు ప్రాణాలు బలికావటం, 43 మందికి పైగా గాయపడటం చరిత్ర ఎరుగని విషాదమన్నారు. ఇంతటి మహా విషాదానికి కారణమైన అధికారుల్ని ఎందుకు కాపాడుతున్నారంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై గురువారం రాత్రి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేర్వేరుగా స్టేట్‌మెంట్‌లు ఇవ్వడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు.