దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 23 మంది సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకోసం పోలీసులు ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు.
వీరిపై తెలంగాణలో 30, దేశవ్యాప్తంగా 328 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. నిందితుల నుంచి సెల్ఫోన్లు, చెక్‌బుక్‌లు, సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.