తిరుపతి తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర కోణంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని టీటీడీ బోర్డు సభ్యుడు, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్పారు. అనంతపురంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆయాసంతో బాధపడుతున్న వృద్ధురాలికి సాయపడే సమయంలో కొంతమంది అరుపులే తొక్కిసలాటకు కారణమనే వాదన వినిపిస్తోందన్నారు. తొక్కిసలాట వీడియోలు వైసీపీ సోషల్ మీడియాలో ముందుగా ఎలా వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కుట్రదారులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. సామాన్య భక్తులకు భగవంతుని దర్శనం సులభతరం చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేస్తోందని చెప్పారు. మూడు రోజులకు 1.20 లక్షల టోకెన్లు జారీ చేశామని తెలిపారు.