వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరణ చేయాలని ఆర్‌వీఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి, కడప జిల్లా కార్యదర్శి బుర్రా రమణ డిమాండ్ చేశారు. ములకలచెరువు తహసీల్దార్ కార్యాల యం ఎదుట వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరు ద్ధరణ చేయాల న్నారు. వాల్మీకులు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో బీసీ జాబితాలో ఉండడం దురదృష్టకరమన్నారు. అనంతరం తహసీల్దార్ ప్రదీప్‌కు వినతి పత్రం అందజేవారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర జయింట్ సెక్రటరీ ఆనంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి మేకల శివప్రసాద్, రాయలసీమ జిల్లాల మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రమీల, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు మల్లెం అశోక్, నాయకులు పాల్గొన్నారు.