గురువారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమలలోని బైరాగపట్టెడలోని పద్మావతి పార్కుకు చేరుకుని ఘటనా స్థలానికి పరిశీలించారు. అక్కడే ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది క్షమించరాని తప్పుగా అభివర్ణించారు. అక్కడనుంచి నేరుగా మధ్యాహ్నం 2.40 గంటలకు స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. దాదాపు గంటకు పైగా వారితో పాటు బంధు మిత్రులతో మాట్లాడారు. సంఘటన ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. దురదృష్టకర ఘటనపై చింతించారు. ఆతర్వాత టీటీడీ పరిపాలన భవనంకు చేరుకుని తొక్కిసలాట ఘటనపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, సీవీఎస్వో శ్రీధర్‌లను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణకుమార్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. మీడియా సమావేశం అనంతరం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకు పయనమయ్యారు.