తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందారు. ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ స్పందించారు. ఈ సందర్భంగా చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తులు ఆత్రుతతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి టిఫిన్లు అన్నం తినకుండా క్యూలైన్లలోకి రావడం బీపీ షుగర్ లెవెల్లో పడిపోవడంతోనే అస్వస్థతకు గురై కింద పడ్డారని తెలిపారు. ఈ ఘటనపైన విమర్శలు ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు. టీటీడీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పారు. నిన్న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్ఘాటించారు చింతామోహన్. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా దీనిపైన ఆ సభలో ప్రస్తావించకపోవడం బాదేస్తోందని చింతామోహన్ అన్నారు.