తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. అనంతపురం శ్రీనగర్ కాలనీలోని అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో గురువారం డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ నిర్వహణ ఆవరణంలో బాలకృష్ణ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు గౌస్‌మొద్దీన, ఎనబీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు జగనతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతపురం నగరంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ నిర్వహణ కోసం భారీగా ఏర్పా ట్లు జరిగాయని, అయితే తిరుపతి ఘటన నేపథ్యంలో ఈవెంట్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. సినిమా రిలీజ్ తర్వాత మరో కార్యక్రమం నిర్వహణపై త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటిస్తుందన్నారు. అభిమాను లు ఈ విషయాన్ని గమనించాలనిసూచించారు. బాలకృష్ణ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు గౌస్‌మొద్దీన మాట్లాడుతూ... ఈవెంట్ కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశామన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సూచన మేరకు ఈవెంట్‌ను రద్దు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, టీడీపీ నాయకులు గడ్డం సుబ్రహ్మణ్యం, బుగ్గయ్యచౌదరి, సరిపూటి రమణ, బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.