ఏపీలోని కూటమి ప్రభుత్వం కేబినెట్ హోదా కలిగిన వారికి తీపి కబురు చెప్పింది. కేబినెట్ ర్యాంక్ ఉన్నవారి జీతభత్యాలను పెంచాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి వారికి ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల జీతం అందనుంది.వేతనంతో పాటు ఆఫీస్ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్ టైమ్ గ్రాంట్‌ను కూడా విడుదల చేయనుంది. అలాగే వ్యక్తిగత సహాయ సిబ్బందిని నియమించుకునేందుకు అలవెన్స్ ఇతర సౌకర్యాల కోసం మరో రూ. 2.50 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కేబినెట్ హోదాలో ఉన్నవారికి నెలకు మొత్తం రూ. 4.50లక్షలు అందనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేబినెట్ ర్యాంక్ ఉన్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు