ఈ నెల 22 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్‌కు తనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత తను చీలమండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. జట్టులోకి పునరాగమనం చేయాలని చాలా కాలంగా కఠోర శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో దేశవాళీల్లోనూ తను ఆడాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే వన్డే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో తను బౌలింగ్ చేశాడు. ఇటీవలే జరిగిన విజయ్ హజారే టోర్నీలో పూర్తి 10 ఓవర్ల కోటా బౌలింగ్ ను పూర్తి చేశాడు. అతని గాయాలపై ఎన్సీఏలోనూ డాక్టర్ల టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే తను జట్టులోకి వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇదే స్క్వాడ్ లో ఇద్దరు తెలుగు ప్లేయర్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి లకు కూడా చోటు దక్కింది. ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన 4 టీ20ల సిరీస్ లో తిలక్ భీకర ఫామ్‌ను చూపించిన సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ రెండు సెంచరీలను బాదాడు. ఆసీస్ టూర్లో అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి టీ20 సిరీస్‌లో చోటు దక్కింది. ఆ సిరీస్‌లో భారత్ తరపున రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నితీశ్ నిలిచాడు. బ్యాట్ తో 298 పరుగులు బంతితో ఐదు వికెట్లు తీశాడు. దీంతో పొట్టి ఫార్మాట్లోకి తిరిగి ప్రవేశించాడు. ఇక రెండో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురేల్‌కు స్థానం దక్కింది. మెయిన్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ ఉండగా, అతనికి రిజర్వ్‌గా సంజూ శాంసన్ ఆడతాడు. రెండో వికెట్ కీపర్‌గా జెరెల్ను స్టాండ్ బైగా తీసుకున్నారు. మరోవైపు విధ్వంసక ఆల్ రౌండర్ శివం దూబేను జట్టు నుంచి తప్పించారు. ఇక అభిషేక్ శర్మకు కూడా వేటు తప్పలేదు. అతని స్థానంలో ఇన్ ఫామ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఇంగ్లాండ్- భారత్ ల మధ్య ఐదు టీ20ల సిరీస్ కొరకు ఎంపిక ఐన భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి, షమీ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్.