స్టార్ పేసర్ మహ్మద్ షమీ సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి పునరామగనం చేశాడు. ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం నేడు భారత జట్టును ప్రకటించారు. అందులో షమీకి కూడా స్థానం కల్పించారు. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ఫ్రిబవరి 2 వరకు జరగనుంది. నేడు సమావేశమైన బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ఈ సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ లో అదరగొట్టిన తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఈ జట్టులో ఉన్నాడు.