అమెరికా నూతన అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కమలా హారిస్‌పై రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అమెరికా 47వ నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కానుండగా భారత్ తరఫున కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.