వైసీపీ మాజీ మంత్రి రోజాకు తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. తిరుమల టికెట్ల టోకెన్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నదని అన్నారు.
దర్శనానికి వెళ్లిన ప్రతిసారి వందలాది మందిని తీసుకెళ్లావని, నీ కథ చెప్పాలంటే చాలా ఉందన్నారు. చంద్రబాబు పున్యనా రాజకీయాల్లోకి వచ్చావని, నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడవద్దన్నారు.