విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం సంతోషంగానే ఉన్నా, అది అప్పులకే సరిపోదని, ఆ మొత్తంతో స్టీల్ ప్లాంట్ ఏ మాత్రం గట్టెక్కే పరిస్థితి లేదని వైయస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. ప్రధానంగా మూడు అంశాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాపిటివ్ మైన్స్, ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడం, సంస్థను ప్రైవేటీకరించబోం అన్న వాటిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నట్టు కేంద్రం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.