వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను రద్దు చేసే హక్కు సీఎం చంద్రబాబుకి లేదని, ఒకవేళ చంద్రబాబు మూర్ఖంగా ముందుకెళితే వేల సంఖ్యలో కోర్టు కేసులు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు హెచ్చరించారు. రద్దు చేసిన ఇళ్ల పట్టాలను టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే కుట్ర జరుగుతోందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. లబ్ధిదారుల పక్షాన వైయస్ఆర్‌సీపీ నిలబడి పోరాడుతుందని వెల్లడించారు.మంత్రివర్గ సమావేశం జరుగుతుందంటే ప్రభుత్వం మనకేదైనా మంచి చేసే కార్యక్రమానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటుందని ప్రజలు ఎదురు చూస్తారు. కానీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇళ్ల పట్టాల రద్దు రూపంలో పేదవారిపై మరో పిడుగుపాటు లాంటి నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు గత పాలన చూస్తే మూడుసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఏనాడూ పేదవారికి సెంటు భూమి పంచిన దాఖలాలు లేవు. దాని మీద ఎప్పుడైనా చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు.