తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, నారావారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ మార్పూరి రాకేష్ మృతి చెందాడు. అర్ధరాత్రి గ్రామానికి సమీపంలోని పంటపొలాల్లోకి ఏనుగుల గుంపు వచ్చింది. దీంతో ఎనుగును బెదిరించడానికి అటవీశాఖ అధికారులు గ్రామస్తులతో కలిసి రాకేష్ వెళ్లాడు. బెదిరించే క్రమంలో ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి. అందరూ తప్పించుకోగా ఓ ఏనుగు రాకేష్‌ను తొండంతో పట్టుకుని నేలకేసి కొట్టింది. దీంతో రాకేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా రాకేష్ సీఎం చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పులవర్తి నాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చురుకైన యువనేతను కోల్పోయామని ఎమ్మెల్యే, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా మార్పూరి రాకేష్ భార్య గర్బిణి.