పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ అత్యంత అనువైన, స్నేహపూర్వకమైన రాష్ట్రంగా దావో్‌సలో ప్రచారం కల్పించేందుకు నెట్వర్క్ 18 గ్రూప్‌నకు చెందిన సీఎన్‌బీసీ టీవీ-18కు ప్రభుత్వం రూ.1,15,64,000 మంజూరు చేసింది. కాగా, డిజిటల్, సోషల్ మీడియాల్లో ప్రచారం బాధ్యతను బిజినెస్ టుడేకు ఇచ్చారు. అందుకోసం సదరు సంస్థకు రూ.61,50,280 చెల్లించడానికి డిజిటల్ కార్పొరేషన్ ఎండీకి అనుమతిస్తూ జీవో నంబరు 101 జారీ అయింది. శనివారం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.