మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్ నుంచి బియ్యం మాయం కేసులో అరెస్ట్ చేసిన నలుగురు నిందితులలో ముగ్గురికి స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి శనివారం బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో వీరిని ఈ నెల 12వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏ7గా ఉన్న మాతా వెంకటేశ్వరరావు (ధాన్యం వ్యాపారి), ఏ9 గోపిశెట్టి నాంచారయ్య (ఆటోడ్రైవర్), ఏ11 కందుల బాపూజీలకు (బియ్యం వ్యాపారి) బెయిల్ మంజూరైంది. మరో నిందితుడు, ఈ కేసులో ఏ8గా ఉన్న పంతగాని నాగేశ్వరరావు శనివారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాగాయలంక ఎంఎల్ఎస్ (మల్టీ లెవల్ స్టాక్) పాయింట్లో నాగేశ్వరరావు గతంలో పనిచేశారు. ఇక... ఏ10గా ఉన్న డొక్కు నాగరాజు ఇటీవల మరణించారు.