పక్షుల పండుగ అట్టహాసంగా మొదలైంది. సూళ్లూరుపేట హోలిక్రాస్ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు ప్రారంభించారు. చిన్నారులు ప్రదర్శించిన ఫ్లెమింగో పాట అందరినీ అలరించింది. నేలపట్టు, అటకానితిప్పల వద్ద పక్షుల వీక్షణకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఇక భీములవారిపాళెం రేవులో పడవ షికారుకు పర్యాటకులు ఉత్సా హం చూపారు. సినీనటుడు శివారెడ్డి మిమిక్రీతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.