అంతరించిపోతున్న కళలను కాపాడుతూ పురాతన ఆచార వ్యవహారాలను భావితరాలవారికి తెలియజే యాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు పిలుపునిచ్చారు. అనంతవరంలో నాలుగురోజుల నుంచి జరుగుతున్న ఎన్టీ ఆర్ కళాపరిషత్ తృతీయ ఉభయ తెలు గు రాష్ట్రాల నాటికల పోటీలు శనివారం రాత్రితో ముగిశాయి. నాటిక ప్రదర్శనలకు ముందుగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సభా వేదికపైన కళాపరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతి థిగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడారు. కళల ను కాపాడేందుకు, కళాకారులకు ప్రోత్సా హం అందించేందుకు పరిషత్‌లో చేస్తున్న కృషిని ఏలూరి అభినందించారు. పల్లెల్లో ఇంతగొప్పగా మూడేళ్ల నుంచి ఎన్టీఆర్ కళాపరిషత్ నాటిక పోటీలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. కళాపోషకులు, కళాప్రియులు సహకారంలో భవిష్యత్‌లో కూడా కళాపరిషత్‌లు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రదర్శించిన నాటికల ఇతివృత్తాలలో మన జీవితాలకు దగ్గరగా ఉన్న వాటిలో మంచిని స్వీకరించి, చెడును వదిలేయాలన్నారు.పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు కూడా కళారంగంపై ఉన్న మక్కువతో, నటనపై ఉన్న ఆసక్తితో రంగస్థల కళాకారులుగా గుర్తింపు పొందిన వారున్నారని ఏలూరి పలువురిని ఉదహరించారు. మరో ముఖ్య అతిథి ఏపీ క్రియేటివ్ కల్చర్ కమిషన్ చైర్మన్ పొడపాటి తేజస్విని మాట్లాడుతూ కళాకారులు సున్నిత మనస్కులని, వారి నటనకు ప్రేక్షకులు కొట్టే చప్పట్లు వారికి బంగారు ఆభరణాలు వంటివని అన్నారు. కార్యక్రమంలో కందిమళ్ల సాంబశివ రావు, కొండ్రగుంట జయరావు, గుదే తారకరామారావు, మండవ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.