వర్షపునీరు వృథా కాకుండా భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉరవకొండ మండలంలోని లత్తవరంలో శనివారం ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, వ్యక్తిగత ఇంకుడు గుంతలను ప్రారంభించారు. అలాగే కమ్యూనిటీ నీటి గుంతలు, వ్యక్తిగత నీటి గుంతల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామ సచివాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వర్షపు నీరు వృథా కాకుండా భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు రూప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, జడ్పీసీఈవో రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ సలీం బాషా, డీపీఓ నాగరాజు, బీసీ వెల్ఫేర్ డీడీ కుష్బూ కొఠారి, తహసీల్దార్ మహబూబ్బాషా, ఎంపీడీఓ రవి ప్రసాద్, సీడీపీఓ శ్రీదేవి, ఏపీఓ విమల, మాజీ సర్పంచ గోవిందు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.