రాష్ట్రంలో 117 జీఓ రద్దు అనంతరం క్లస్టర్ పాఠశాలల ఏర్పాటు, మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఎంపిక ద్వారా పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియలో ఎ టువంటి సమస్యలు ఉత్ప న్నం కాకుండా ఆర్జేడీ శామ్యుల్‌ను ఎ స్టీయూ నాయకులు కోరారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తిచేయాలని కోరా రు. ఆర్జేడీ స్పందిస్తూ త్వరలో సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించి పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురే్‌షబాబు బాలగంగిరెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇలియాస్ బాషా, సంగమేశ్వర్‌రెడ్డి, జిల్లానాయకులు చెన్నకేశవరెడ్డి, ప్రతా్‌పరెడ్డి, మస్తాన బాబు, చంద్రమోహనరెడ్డి, తులసీదర్, ధర్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.