రుషికొండ భవనాలపై విష ప్రచారం చేస్తున్నారు. పవన్‌కి ఒక్కడికే బాబు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. వైయస్ జగన్ సామాజిక న్యాయం చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు ఇప్పుడు లోకేష్‌కే కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. వైయస్ జగన్ సామాజిక న్యాయం చేస్తే బాబు సామాజిక మోసం చేశారని పోతిన మహేష్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి అమిత్ షా రెకమెండ్ చేస్తే ఇచ్చారని ట్విటర్‌లో పెట్టారు. బాబు సామాజిక మోసంపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు మాట్లాడాలి. 30 లక్షల మంది పేదవారికి సొంతింటి కలను నేరవేర్చాడం విధ్వంసకర పాలన అంటారా?ప్రజలకు పరిపాలన దగ్గర చేసేందుకు గ్రామవార్డు సచివాలయాలు పెట్టడం విధ్వంసకర పాలన అంటారా? విద్యా, వైద్య రంగాలను అభివృద్ది చేస్తే విధ్వంసకర పాలన అంటారా?హర్బర్లు, పోర్టులు, మెడికల్ కాలేజీలు పెట్టి అభివృద్ది చేయడం విధ్వంసకర పాలన అంటారా’అని మహేష్ ప్రశ్నించారు.