చంద్రబాబు దావోస్ పర్యటనంతా భజన, అబద్ధాలేనని, అనవసర ఖర్చు తప్ప రాష్ట్రానికి ఏ మేలూ జరగదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో 2014–19 మధ్య ఇదే జరిగిందన్న ఆయన, చంద్రబాబు ఎన్నిసార్లు పర్యటించినా, రాష్ట్రానికి పెట్టుబడులు ఏవీ రాలేదని గుర్తు చేశారు. మీడియాకు డబ్బులిచ్చి భారీగా ప్రచారం చేసుకున్నంత మాత్రాన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ముందుకొచ్చే అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. కమిషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించకుండా, పారదర్శకంగా వ్యవహరించి వేగంగా అనుమతులు ఇస్తేనే ఏదైనా సాధ్యమని వెల్లడించారు.