సామాన్య పేద కుటుంబానికి చెందిన ఓ మహిళ రాష్ట్రపతి భవన్లో ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు జరిగే విందుకు ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద దేశ వ్యాప్తంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద ఇల్లు కట్టుకున్న చిత్తూరు న్యూ ప్రశాంత్‌నగర్‌కు చెందిన సల్మా ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన లేఖను తపాలాశాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గణపతి, అసిస్టెంట్ పోస్టుమాస్టర్ భాస్కర్, పోస్టు ఉమెన్ లక్ష్మీప్రసన్నలతోపాటు హౌసింగ్ ఏఈ ఽశ్రీధర్ స్వయంగా వెళ్లి సల్మాకు మంగళవారం అందించారు. సల్మాతోపాటు ఆమె భర్త సర్దార్ షరీ్‌ఫకు ప్రయాణ ఖర్చులతోపాటు ఢిల్లీలో వసతి, ఇతర సౌకర్యాలను రాష్ట్రపతి భవనే భరిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు.