ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2025, 11:53 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఈరోజు (2025, జనవరి 27న) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 23,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ 161 పాయింట్లు తగ్గి 22,930 వద్ద ట్రేడవుతోంది.అలాగే సెన్సెక్స్ 550 పాయింట్ల నష్టంతో 75,639 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 460 పాయింట్ల క్షీణతను ఎదుర్కొని 47,910 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్‌లో 900 పాయింట్లు, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో 550 పాయింట్లు తగ్గాయి. ఇండియా VIX 6% పెరిగింది. ఇది మార్కెట్‌లో పొటెన్షియల్ రిస్క్‌ను సూచిస్తోంది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు.ఈ రోజు మార్కెట్‌లో రియాల్టీ సెక్టార్ తప్ప, అన్ని రంగాలు నష్టాల్లో ఉన్నాయి, వీటిలో ఐటీ, మెటల్ సూచీలు అత్యంత ప్రభావితమైనవి. మార్కెట్ ప్రారంభంలో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ స్టాక్స్ పాజిటివ్ ట్రెండ్‌లో ఉన్నాయి. తర్వాత HUL, ICICI బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ కూడా లాభపడ్డాయి. కానీ BHEL, శ్రీరామ్ ఫైనాన్స్, JSW స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్ వంటి స్టాక్స్ క్షీణించాయి. సెన్సెక్స్‌లో ఉన్న 30 స్టాక్స్‌లో 5 మాత్రమే పాజిటివ్ జోన్లో ఉన్నాయి. వీటిలో FMCG స్టాక్స్, ICICI బ్యాంక్, ఆసియన్ పెయింట్స్ లాంటి కంపెనీలు ఉన్నాయి.

ఈ ఉదయం GIFT నిఫ్టీ 171 పాయింట్లు పడిపోయి 22,942 వద్ద ట్రేడైంది. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లు కూడా నష్టాల మధ్య ఉన్నాయి. నాస్‌డాక్ ఫ్యూచర్స్ 1.5% తగ్గిపోయాయి. శుక్రవారం 4 రోజుల లాభాల తర్వాత, అమెరికా మార్కెట్లలో స్వల్ప లాభాల బుకింగ్ కనిపించింది. డౌ జోన్స్ 150 పాయింట్లు క్షీణించగా, నాస్డాక్ 100 పాయింట్లు తగ్గింది. అయితే, S&P 500 మూడు రోజుల పాటు జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. కానీ తరువాత స్వల్పంగా తగ్గింది. నిక్కీ మార్కెట్ ఈ ఉదయం స్వల్పంగా పెరిగింది.


దేశీయ మార్కెట్‌లో బంగారం ధర 80,300 రూపాయలకు చేరింది, ఇది రికార్డు స్థాయి అని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర $2,800 వద్ద ఉంది. వెండి ధర 1% పెరిగి 31 డాలర్లకు చేరుకుంది. ముడి చమురు ధర 1% తగ్గి $77 దిగువకు చేరింది. డాలర్ ఇండెక్స్ కూడా క్షీణించి, 107 వద్ద 1.5 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది.ఈరోజు ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి ఫలితాలను ప్రకటించాయి. యస్ బ్యాంక్ ఫలితాలు మిశ్రమంగా ఉండగా, IDFC ఫస్ట్ బ్యాంక్ ఫలితాలు బలహీనంగా ఉన్నాయి. JSW స్టీల్ ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా ఉన్నాయి. NTPC, టోరెంట్ ఫార్మా, CDSL ఫలితాలు నిరాశాజకంగా ఉండాయి. ఇండిగో, లోధా, జేకే సిమెంట్ ఫలితాలు బలంగా ఉన్నాయి. కానీ గోద్రేజ్ కన్స్యూమర్, డీఎల్ఎఫ్, బాల్కృష్ణ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు మార్కెట్ ముగిసిన తర్వాత, నిఫ్టీలో కోల్ ఇండియా, టాటా స్టీల్ ఫలితాలు విడుదల అవుతాయి. F&O ట్రేడింగ్‌లో IOC, IGL, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పిరమల్, ACC వంటి కంపెనీల ఫలితాలపై ఫోకస్ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com