జాతీయ ఆరోగ్య మిషన్‌ను మరో పదేళ్లు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్‌ను 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. శిశు మరణాలు, మాతృ మరణాల రేటు తగ్గించడం, అంటు వ్యాధులను నిరోధించడం, స్త్రీ, శిశు ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్య సేవలు అందించడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం.