ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( అంటే తెలియని వారైతే ఎవరూ ఉండరు. సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని నారా చంద్రబాబు నాయుడు వివాహం చేసుకున్నారు.అప్పట్లో ఆయన వివాహానికి సంబంధించిన పెళ్లి కార్డ్ ఇప్పుడు నెట్టింటి వైరల్ గా మారింది. 10 -09-1981 గురువారం రోజున ఉదయం 08:06 నిమిషాలకు వివాహం జరిగింది. మరి ఆ పత్రిక ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూద్దాం..ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరితో నా వివాహమని చంద్రబాబే స్వయంగా ఆహ్వానిస్తున్నట్లుగా ఆ కార్డు లో ఉంది. ఈ పెళ్లి సెప్టెంబర్ 10,1981 చెన్నైలో జరిగింది. అప్పటికే చంద్రబాబు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉండగా, ఇక ఎన్టీఆర్ కూడా మూవీస్ లో టాప్ హీరో గా ఉన్నారు. ఈ ఇద్దరూ నాయకులు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. రాజకీయవేత్తలు , సినీ నటులు, పెళ్లికి హాజరై వధూవరులను దీవించారు.ఇక కట్నం విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు. అసలు నందమూరి,నారా కుటుంబాల మధ్య కట్నం అనే మాట కూడా వినిపించదట. కానీ, పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా జరిపించారని తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.