ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచనున్నట్లు తెలిపారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం ఛార్జీలు పెంచనున్నట్లు తెలిపారు. అయితే అమరావతి పరిసర గ్రామాలకు ఈ ఛార్జీల పెంపును మినహాయించనున్నట్లు పేర్కొన్నారు.