పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడే తప్ప తాగి పాఠశాలకు రావడమే కాకుండా బడిలోనే మద్యం తాగి విద్యార్థులను చితకబాదిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న జయరాజు అనే ఉపాధ్యాయుడు మద్యం తాగి పాఠశాలకు రావడమే కాకుండా చిన్నారులను చితకబాదారు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని జయరాజుపై వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.