పెనుకొండ పట్టణంలోని బసవతారక రామారావు కాలనీలో డ్రైనేజీ నీరు పోవుటకు గల స్థలములో స్థలదారులు అడ్డుకట్ట వేయడంతో డ్రైనేజ్ నీరు నిలిచింది.
ఈ విషయాన్ని సోమవారం టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములకు స్థానికులు తెలపడంతో అక్కడికి వెళ్లి అయన పరిశీలించారు. డ్రైనేజ్ నీరు వెళ్ళుటకు తాత్కాలిక పనులను వెంటనే చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ కి, మున్సిపల్ ఇంజనీర్ పవన్ దృష్టికి తీసుకెళ్లారు.